భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి కాలరీస్ కొత్తగూడెం ఏరియాలోని జేవీఆర్ 2 ఓసీ ప్రాజెక్ట్ రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తిని చేసింది. 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో కోటి టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. టార్గెట్ కంటే 10 లక్షల టన్నుల బొగ్గును ఎక్కువ ఉత్పత్తి చేసి రికార్డు సాధించింది. ఇల్లందు ఏరియాలోని జేకే 5 ఓసీ గని 13.69 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. మణుగూరు ఏరియాలోని పీకే ఓసీ 2 మైన్65,22,476 టన్నులు, పీకే ఓసీ 4 ప్రాజెక్ట్ 39,27,524 టన్నులు, జీడీకే 5 ఓసీ 35,05,215, ఆర్జీఓసీ 3 ప్రాజెక్ట్ 74,83,076, ఆర్జీ ఓసీ 1 ఎల్‌ఈపీ ప్రాజెక్ట్ 36,94,686, ఖైరిగూడ ఓసీపీ 37,50, 000, ఎస్‌ఆర్‌పీఓసీ 2 ప్రాజెక్ట్ 31,72,897 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేశారు.
ఆ మైన్స్ డీలా :
సింగరేణిలోని పలు మైన్స్ నిర్దేశిత వార్షిక ఉత్పత్తి లక్ష్య సాధనలో వెనుకబడ్డాయి. కనీసం టార్గెట్‌లో సగం కూడా ఉత్పత్తి చేయలేకపోయాయి. కొత్తగూడెం ఏరియాలోని పీవీకే 5 ఇంక్లైన్ అండర్ గ్రౌండ్ మైన్ నిర్దేశించిన లక్ష్యంలో కేవలం 46 శాతం బొగ్గు ఉత్పత్తికే పరిమితమైంది. 4,50,000 టన్నుల లక్ష్యం కాగా కేవలం 2,05,730 టన్నుల బొగ్గును మాత్రమే ఉత్పత్తి చేసింది. మందమర్రి ఏరియాలో ఎస్‌కే అండర్ గ్రౌండ్ మైన్ 28 శాతం, కాసీపేట 2 అండర్ గ్రౌండ్ మైన్ 32 శాతం, కాసీపేట మైన్ 43 శాతం, భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 8 అండ్8ఏ మైన్ 35 శాతం మాత్రమే బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాయి.