బొగ్గు ఉత్పత్తిలో జేవీఆర్​ ఓసీ–2 గని రికార్డు

బొగ్గు ఉత్పత్తిలో జేవీఆర్​ ఓసీ–2 గని రికార్డు
  • ఐదు రోజులకు ముందే 112 లక్షల టన్నుల టార్గెట్ రీచ్ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం ఏరియాలోని జేవీఆర్​ఓసీ–2 రికార్డు స్థాయిలో 112 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో యాజమాన్యం నిర్దేశించిన టార్గెట్ ను ఐదు రోజుల ముందుగానే చేరుకుంది.  ఏరియా జనరల్​ మేనేజర్​ షాలెం రాజు గురువారం మాట్లాడుతూ ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక మైన్​112 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడం సింగరేణిలోనే రికార్డు అని పేర్కొన్నారు. 

ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు సలహాలు సూచనలు ఇస్తూ ప్రోత్సహించిన సీఎండీ బలరాం నాయక్​, డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణిలోనే రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధించడంలో కీలక భూమిక పోషించిన కార్మికులు, ఆఫీసర్లకు ఆయనతో పాటు ఏఐటీయూసీ, ఐఎన్​టీయూసీ నేతలు మల్లికార్జున్​, ఎండీ రజాక్​ అభినందనలు తెలిపారు. మైన్​ లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు స్పెషల్​ఇన్సెంటీవ్​ ఇచ్చే విధంగా యాజమాన్యం చర్యలు తీసుకోవాలన్నారు.