టాటూ అక్కడ.. వీడియో మొత్తం గోల గోల

టాటూ అక్కడ.. వీడియో మొత్తం గోల గోల

నటి జ్యోతిరాయ్‌(Jyothi rai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి పాత్రలో తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరయింది ఈ బ్యూటీ. కర్ణాటకకు చేసిన జ్యోతిరాయ్‌.. సీరియల్స్ లో వయసుకు మించిన పాత్రలు చేసి ఆకట్టుకుంది. కానీ, తన సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ చూసి ఆడియన్స్ నోరెళ్లబెట్టేశారు. సీరియల్స్ లో పద్దతిగా చీరకట్టుకొని కనిపించిన ఆమె.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్ళ గుండెల్లో సెగలు పుట్టించింది. 

అవి చూసిన నెటిజన్స్ హీరోయిన్ మెటీరియల్ తో తల్లి పాత్రలు చేయించడం మహా పాపం అంటూ కామెంట్స్ చేశారు. ఇక అప్పటినుండి లేటెస్ట్ ఫోటో షూట్స్ చేస్తూ నెటిజన్స్ కు నిద్రలేకుండా చేస్తోంది. ఇక ఇటీవలనే ఒక బోల్డ్ వెబ్ సిరీస్ కూడా ఒకే చేసింది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులం ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా జ్యోతిరాయ్‌ కి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో తన గుండెలపై టాటూ వేయించుకుంటూ కనిపించింది జ్యోతిరాయ్‌. హోప్ తో పాటు సీతాకోకచిలుక ఉన్న బ్యూటిఫుల్ టాటూగా వేయించుకున్నారు జ్యోతిరాయ్‌. అదంతా వీడియో చేసి తన ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది. ఆ వీడియో టాటూ వేస్తున్నప్పుడు కలిగే బాధను భరించలేక గోల గోల చేసింది ఆమె. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీలుంటే మీరు కూడా చూసేయండి.