గ్లామర్ షోకు సిద్ధమైన గుప్పెడంత మనసు జగతి.. ది ప్రెట్టీ గర్ల్ ఫస్ట్ లుక్ రిలీజ్

గుప్పెడంత మనసు(Guppedantha manasu) సీరియల్ ఫేమస్ అయిన నటి జ్యోతి రాయ్(Jyothi rai). ఈ సీరియల్ లో హీరో రిషి తల్లిగా.. మహేంద్ర భూషణ్‌ భార్యగా.. అద్భుతమైన నటనతో ఆడియన్స్ మనసు గెలుచుకుంది ఈ బ్యూటీ. అయితే సీరియల్స్ లో చాలా పద్దతిగా కనిపించిన ఈ మేడం.. ఇన్ స్ట్రాగ్రామ్‌ ఫొటోస్ చూసి చాలా అవాక్కయ్యారు. పొట్టి పొట్టి డ్రెస్సులతో.. హాట్ హాట్ ఫోజులతో నెటిజన్స్ మైండ్ బ్లాక్ చేసింది ఈ బ్యూటీ. దీంతో జగతి మేడం అంటి ఇలా మారిపోయింది అనుకున్నారు. మరికొందరైతే.. ఇంత గ్లామర్ లేడీని తల్లి పాత్రకు తీసుకోవడం ఏంటి అంటూ కామెంట్స్ చేశారు.

Also Read : క్యూరియాసిటీని పెంచేస్తోన్నహెబ్బా పటేల్ కొత్త మూవీ పోస్టర్

అయితే జ్యోతి రాయి హాట్ ఫొటోస్ వెనుక ఒక కథ ఉంది. అదేంటంటే.. తాజాగా ఆమె ఒక వెబ్‌ సీరిస్‌లో నటించేందుకు ఒకే చెప్పిందట. ఇదే విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపింది జ్యోతి రాయ్. ది ప్రెట్టీ గర్ల్(The pretty girl) అనే టైటిల్ తో వస్తున్న ఈ వెబ్ సిరీస్ ను రాహుల్ దీపక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్ ను ప్రకటిస్తూ ఒక హాట్‌ ఫోటోను షేర్‌ చేసింది ఈ బ్యూటీ. ఆ పోస్టర్ చూస్తేనే సిరీస్ ఎలా ఉండబోతుందో క్లియర్ గా అర్థమవుతోంది. ఇన్ని రోజులు సీరియల్‌ కాబట్టి పద్ధతిగా కనిపించిన ఈ బ్యూటీ.. ఓటీటీలో తన గ్లామర్ తో రెచ్చిపోయేందుకు సిద్ధమైంది. మరి ఈ సిరీస్ తో జ్యోతి రాయ్ ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.