ఫైనల్లో జ్యోతి బృందం

యెచియాన్‌‌‌‌‌‌‌‌ (సౌత్‌‌‌‌‌‌‌‌ కొరియా): వరల్డ్ నంబర్‌‌‌‌‌‌‌‌వన్‌‌‌‌‌‌‌‌ ఇండియా ఆర్చరీ టీమ్‌‌‌‌‌‌‌‌.. వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ స్టేజ్‌‌‌‌‌‌‌‌–2లో సత్తా చాటింది. బుధవారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌ కాంపౌండ్‌‌‌‌‌‌‌‌ సెమీస్‌‌‌‌‌‌‌‌లో జ్యోతి సురేఖ–పర్నీత్‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌–అదితి స్వామితో కూడిన ఇండియా త్రయం 233–229తో వరల్డ్‌‌‌‌‌‌‌‌ నాలుగో ర్యాంకర్‌‌‌‌‌‌‌‌ అమెరికాను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వాలిఫయింగ్‌‌‌‌‌‌‌‌ రౌండ్‌‌‌‌‌‌‌‌లో రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచిన ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లో 236–234తో ఇటలీపై నెగ్గింది. ప్రియాన్షు–ప్రథమేశ్‌‌‌‌‌‌‌‌–అభిషేక్‌‌‌‌‌‌‌‌ వర్మతో కూడిన ఇండియా మెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ తృటిలో బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ను మిస్‌‌‌‌‌‌‌‌ చేసుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా 133–133తో స్కోరును సమం చేసింది. దీంతో ఇరుజట్ల మధ్య షుటాఫ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించగా ఆసీస్‌‌‌‌‌‌‌‌ 10*–10తో విజయం సాధించింది.