
ఆబర్న్‌డేల్ (అమెరికా): ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 1లో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ–రిషబ్ యాదవ్ ఫైనల్ చేరారు. దాంతో ఈ టోర్నీలో ఇండియాకు మూడో పతకం ఖాయం అయింది. శుక్రవారం జరిగిన కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ సెమీఫైనల్లో సురేఖ–రిషబ్ 159-–155తో స్లోవేనియా ద్వయంపై గెలిచి ఫైనల్‌కు అర్హత పొందింది. ఐదో సీడ్‌గా బరిలోకి దిగిన ఇండియా జోడీ తొలి రౌండ్‌లో 156-–149తో స్పెయిన్, క్వార్టర్ ఫైనల్లో 156-–154తో డెన్మార్క్ ప్రత్యర్థులను ఓడించింది. శనివారం జరిగే గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో చైనీస్ తైపీతో ద్వయంతో పోటీ పడనుంది.