జ్యోతిబాఫూలే బీసీల ఐకాన్

జ్యోతిబాఫూలే బీసీల ఐకాన్
  • బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​గౌడ్

ఖైరతాబాద్, వెలుగు: మహాత్మ జ్యోతిబాఫూలే బీసీల ఐకాన్​అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​గౌడ్​అన్నారు. సిటీలో ఫూలే విగ్రహం ఏర్పాటు చేయబోతున్న సీఎం రేవంత్​రెడ్డికి బీసీ సమాజం రుణపడి ఉంటుందన్నారు. గతంలో ఏ సీఎం కూడా ఫూలే విగ్రహం ఏర్పాటుకు ముందుకు రాలేదన్నారు. 

శనివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో జాజుల నేతృత్వంలో బీసీ జేఏసీ కమిటీ చైర్మన్​చిన్న శ్రీశైలం యాదవ్, ఇతర నాయకులు సమావేశం నిర్వహించి, ఫూలే విగ్రహానికి పుష్పాభిషేకం చేశారు. రెండు ఎకరాల స్థలంలో ఫూలే విగ్రహం ఏర్పాటు చేస్తున్నందుకు సీఎం రేవంత్​రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్ గౌడ్​కు కృతజ్ఞతలు తెలిపారు. పదేండ్ల పాలనలో కేసీఆర్ ఏనాడూ ఫూలే విగ్రహానికి దండ వేసిన దాఖలాలు లేవన్నారు. బీసీ బిల్లును ఆమోదించిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను త్వరలోనే కలిసి ధన్యవాదాలు చెబుతామన్నారు.