
- 1893లో మహ్మదియన్ ఆంగ్లో ఓరియంటల్ డిఫెన్స్ అసోసియేషన్ సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించాడు.
- సాంస్కృతిక పునరుజ్జీవనం ఫలితంగా ప్రజల్లో రాజులు దైవాంశ సంభూతులనే భావం సడలింది.
- 1784లో ఏషియాటిక్ సొసైటీ స్థాపించారు.
- మన మతం మన వంటింట్లోది అని అన్నది స్వామి వివేకానంద.
- నాకు మరో జన్మ అంటూ ఉంటే అంటరాని వాడిగానే పుడతాను అని గాంధీ అన్నారు.
- అనీబిసెంట్ స్థాపించిన కేంద్ర హిందూ పాఠశాల మదన్ మోహన్ మాలవ్య ఆధ్వర్యంలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంగా మారింది.
- బ్రహ్మ సమాజం మత గ్రంథాలను అన్వయించడానికి పురోహిత వర్గం ఆవశ్యకతను నిరాకరించింది.
- మానవ జాతికి కులం లేదు, మతం లేదు, దేవుడు లేడు అని ప్రకటించిన నాయకుడు అయ్యప్పన్.
- ఆత్మగౌరవ ఉద్యమ నాయకుడు రామస్వామి నాయకర్.
- సత్యశోధక్ సమాజాన్ని జ్యోతిబా పూలే స్థాపించారు.
- మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా సాంఘిక, సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమాలు చేపట్టిన మొదటి వ్యక్తి దయానంద సరస్వతి.
- గిరిజన ప్రజలను దేవుని ప్రతి రూపమని ఫాదర్ ఆఫ్ ది వరల్డ్ అని బిర్సాముండా వర్ణించారు.
- బ్రహ్మ సమాజ్ఇండియాకు కేశవ చంద్రసేన్ నాయకత్వం వహించారు.
- బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాలో వచ్చిన చీలికలు నియో బ్రహ్మ సమాజ్, సాధారణ బ్రహ్మ సమాజ్.
- సంవాద కౌముది ఒక త్రైమాసిక పత్రిక.
- సంవాద కౌముది బెంగాలీ భాషలో ప్రచురించబడింది.
- రాజా రామ్మోహన్ రాయ్ రాధానగరంలో 1774లో జన్మించాడు.
- మిరాత్ ఉల్ అక్బర్, సంవాద కౌముది, బంగదూత రాజా రామ్మోహన్ రాయ్ పత్రికలు.
- బ్రహ్మ సమాజానికి వ్యతిరేకంగా 1829లో ధర్మసభ లేదా ధర్మ సమాజాన్ని రాధాకాంత్దేబో స్థాపించారు.
- ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్, గైడ్ టు పీస్ రాజా రామ్మోహన్ రాయ్‌కు సంబంధించిన పుస్తకాలు.
- విలియం జోన్స్ ఏషియాటిక్ సొసైటీని 1784లో స్థాపించారు.
- భగవద్గీతను ఆంగ్లంలోకి జాన్ విల్కిన్స్ తర్జుమా చేశారు.
- బ్రిటీష్ గవర్నర్ విలియం బెంటింక్ సతీసహగమన నిషేధ చట్టాన్ని రాజా రామ్మోహన్ రాయ్ ప్రోత్సాహంతో చేశారు.
- వేదాలను జర్మన్లోకి మాక్స్‌ముల్లర్ తర్జుమా చేశారు.
- దేవంద్రనాథ్ ఠాగూర్‌కు గల బిరుదు బ్రహ్మర్షి.
- 1833లో రాజా రామ్మోహన్ రాయ్ బ్రిస్టల్ నగరంలో మరణించాడు.
- బ్రహ్మ సమాజాన్ని వన్ గాడ్ సొసైటీగా పిలుస్తారు.
- ఈశ్వరచంద్ర విద్యాసాగర్ నడిపిన వారపత్రిక సోమ్ ప్రకాష్ (బెంగాలీ).
- 1864లో ఆగ్రాలో రాధాసామి సత్సంగ్ స్థాపించింది తులసీరామ్.
- రాజా రామ్మోహన్ రాయ్, అలెగ్జాండర్ డఫ్, డేవిడ్ హ్యూరేల సహాయంతో 1825లో బెంగాల్లో ఏర్పాటు చేసిన ఆంగ్ల పాఠశాల వేదాంత పాఠశాల.
- హెన్రీ వినియన్ డిరాజియో బెంగాల్లో యువ బెంగాల్ ఉద్యమం ప్రారంభించారు.
- హెన్రీ వినియన్ డిరాజియో 1831లో కలరా వ్యాధితో మరణించారు.
- హెన్రీ వివియన్ డిరాజియో ముఖ్య శిష్యుడు ఖాసీ ప్రసాద్ ఘోష్.
- తత్వబోధిని సభ (ట్రూత్ టీచింగ్ అసోసియేషన్)ను దేవేంద్రనాథ్ ఠాగూర్ స్థాపించారు.
- ఈశ్వరచంద్ర విద్యాసాగర్ 1849లో బాలికల కోసం బెథూన్ పాఠశాల స్థాపించారు.
- ఈశ్వర చంద్ర విద్యాసాగర్ కృషి ఫలితంగా డల్హౌసి వితంతు పునర్వివాహ చట్టం 1856లో చేశారు.
- ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అధికార వితంతు పునర్వివాహం 1856, డిసెంబర్లో కలకత్తాలో జరిగింది.
- మత గ్రంథాలను పూజించే సంప్రదాయమైన సమాజాన్ని లాహోర్‌లో 1887లో శివనారాయణ అగ్నిహోత్రి ప్రారంభించారు.
- గాడ్ ఈజ్ ఆఫ్ యాన్ యూజ్ఫర్ ద హంగ్రి బెల్లి అన్నది రామకృష్ణ పరమహంస.
- రామకృష్ణ మిషన్‌కు మరోపేరు వేదాంత ఉద్యమం.
- ఇండియా నీడ్స్ టు కాంకర్ వరల్డ్ వన్స్ అగెయిన్ అన్నది స్వామి వివేకానంద.
- ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఫిలిప్ డ్రింక్ వాటర్ సాయంతో కలకత్తాలో బాలికల పాఠశాలను 1849లో స్థాపించారు.
- ప్రకృతి వైపరీత్యాల సమయంలో సేవా కార్యక్రమాలు అందజేయడం ముఖ్యోద్దేశంగా అలహాబాద్‌లో 1914లో సేవా సమితిని హెచ్.ఎన్.కుంజ్రు స్థాపించారు.