కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి మాధవి రాజే సింధియా బుధవారం ఢిల్లీ ఎయిమ్స్‌లో మరణించారు. ఉదయం 9.28 గంటలకు ఆమె తుది శ్వాస విడిచారు. మాధవి రాజే సింధియా కొన్ని రోజులుగా ఎయిమ్స్‌లో వెంటిలేటర్‌పై ఉన్నారు. న్యుమోనియాతో పాటు సెప్సిస్‌తో బాధపడుతున్న మాధవి రాజే గత మూడు నెలలుగా ఢిల్లీలోని ఓ పెద్ద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆమెకు ప్రస్తుతం70 ఏళ్లు. 1966లో మాధవరావు సింధియాతో మాధవి రాజే సింధియాకు వివాహం జరిగింది. మాధవరావు సింధియా2001లో కన్నుమూశారు. భర్త మరణానంతరం ఆమె రాజకీయాల్లోకి వస్తారని అంతా అనుకున్నారు కానీ ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆమె అప్పుడప్పుడు తన కుటుంబంతో కలిసి పబ్లిక్ ఫంక్షన్లలో కనిపించేది. మాధవి రాజె మరణం పట్ల మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ వీడీ శర్మ సంతాపం తెలిపారు. కేంద్ర పౌరవిమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని గుణ నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు.