గోదావరిఖని, వెలుగు: రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్) లో ఉత్పత్తయ్యే యూరియాలో 50 శాతం తెలంగాణకే ఇస్తున్నామని సీఈవో అలోక్ సింఘల్ అన్నారు. శుక్రవారం ప్లాంట్‌లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆయన జాతీయ జెండా ఎగురేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల భద్రతతో కూడిన ఉత్పత్తి లక్ష్యంగా మేనేజ్‌మెంట్ పనిచేస్తోందన్నారు.
ప్లాంట్ ఉత్పత్తిలో 50 శాతం ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేస్తుండగా, మిగతా సగం స్థానికంగా అవసరాలకు కేటాయిస్తున్నామన్నారు. అనంతరం చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్ కె జా, ఇతర ఉన్నతాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.