తెలంగాణ కాంగ్రెస్ సేవాదళ్ యాదాద్రి జిల్లా జనరల్ సెక్రటరీగా కె బాలరాజు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ యాదాద్రి జిల్లా జనరల్ సెక్రటరీగా కె. బాలరాజు నియమితులయ్యారు .ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు లాల్జి దేశాయి, ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు మిద్దెల జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు.  ఈ సందర్భంగా  బాలరాజు మాట్లాడుతూ..  పార్టీలో సమర్థవంతంగా పనిచేసి, పార్టీని మరింత పటిష్టపరిచి పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు.  

రానున్న పార్లమెంటు ఎన్నికలలో అత్యధిక మెజార్టీ స్థాయిలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తుందని బాలరాజు ధీమా వ్యక్తం చేశారు. తనకు పదవి బాధ్యతలు అప్పగించిన ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖర్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌,  రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ,  ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్,  ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు జితేందర్, భీమశంకర్,సంగ్రామ్ తౌడే ,జిల్లా సేవాదళ్ అధ్యక్షులు రవీందర్, పిట్టల బాలరాజులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు