ఎంపీ పదవికి కేకే రాజీనామా

ఎంపీ పదవికి కేకే రాజీనామా
  • రాజ్యసభ చైర్మన్​ను కలిసి రిజైన్ లెటర్ 
  • నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా: కేకే
  • ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తున్నట్టు సీఎం రేవంత్​ ప్రకటన

హైదరాబాద్, వెలుగు: రాజ్యసభ ఎంపీ పదవికి కె.కేశవరావు రాజీనామా చేశారు. ఆయన గురువారం ఢిల్లీలో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్​ఖడ్​ను కలిసి రిజైన్ లెటర్ అందజేశారు. అనంతరం కేకే మీడియాతో మాట్లాడారు. రాజ్యసభ ఎంపీగా తన పదవీకాలం ఇంకా రెండేండ్లు మిగిలి ఉండగానే రాజీనామా చేశానని ఆయన చెప్పారు. ‘‘నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాను. 

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేశాను” అని తెలిపారు. ఈ సందర్భంగా రాజీనామా లేఖను మీడియాకు విడుదల చేశారు. కాగా, 2026 ఏప్రిల్ 9 వరకు రాజ్యసభ ఎంపీగా కేకే పదవీకాలం ఉన్నది. బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్​గా పని చేసిన కేకే.. బుధవారం కాంగ్రెస్​లో చేరారు. గతంలో కాంగ్రెస్ లోనే సుదీర్ఘకాలం ఉన్న ఆయన.. పీసీసీ చీఫ్​గా పని చేశారు.