ప్రభుత్వ సలహాదారుగా కె.కేశవరావు

ప్రభుత్వ సలహాదారుగా కె.కేశవరావు
  • ఉత్తర్వులు జారీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కె.కేశవరావు నియమితులయ్యారు. ఆయనను కేబినెట్‌‌‌‌‌‌‌‌ హోదాలో పబ్లిక్‌‌‌‌‌‌‌‌ అఫైర్స్‌‌‌‌‌‌‌‌ సలహాదారుగా నియమిస్తూ సీఎస్​ శాంతి కుమారి శనివారం జీవో జారీ చేశారు. కేకే ఇటీవల కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరారు. రాజ్యసభ ఎంపీగా తన పదవీకాలం ఇంకా రెండేండ్లు మిగిలి ఉండగానే రాజీనామా చేశారు. గతంలో కేకే కూతురు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు.