కొత్త పార్లమెంటరీ కమిటీని ప్రకటించిన బీజేపీ

కొత్త పార్లమెంటరీ కమిటీని ప్రకటించిన బీజేపీ

బీజేపీ పార్టీ కొత్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీలో సభ్యులుగా ఎంపిక చేసిన 11 మంది పేర్లను ప్రకటించింది. తెలంగాణ నుంచి కె. లక్ష్మణ్ ను కమిటీ సభ్యునిగా నియమించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలోని బోర్డులో సభ్యులుగా ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సర్బానంద సోనోవాల్, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, ఇక్బాల్ సింగ్, సుధా యాదవ్లకు చోటు కల్పించారు. గతంలో పార్లమెంటరీ బోర్డులో సభ్యుడిగా ఉన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పాటు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ లను పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించడం విశేషం. 

మరోవైపు బీజేపీ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సభ్యుల పేర్లను పార్టీ అధిష్టానం ప్రకటించింది. మొత్తం15 మంది సభ్యుల్లో రాష్ట్రం నుంచి కె. లక్ష్మణ్తో పాటు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫఢ్నవిస్ కు కొత్తగా చోటు కల్పించింది. జేపీ నడ్డా నేతృత్వంలోని ఈ బోర్డులో ప్రధాని నరేంద్రమోడీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, కర్నాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప, సర్బానంద సోనోవాల్, ఇక్బాల్ సింగ్ తదితరులను సభ్యులుగా నియమించారు.