నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలీ.. నెగ్గిన అవిశ్వాస తీర్మానం

నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ  ఓలీ.. నెగ్గిన అవిశ్వాస తీర్మానం

అవిశ్వాత తీర్మానం ద్వారా నేపాల్ ప్రభుత్వం కూలిపోయింది. ప్రస్తుతం ప్రధాని పదవిలో ఉన్న పుష్ప కమల్ దహల్ ప్రచండపై నేపాల్ కాంగ్రెస్ లో  పెట్టిన అవిశ్వాస తీర్మాణం నెగ్గింది. దీంతో ఆ దేశంలో సంకీర్ణంగా నూతన ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రపతి భవన్‌లోని శీతల్ నివాస్‌లో జూలై 15 ఉదయం 11 గంటలకు సీపీఎన్-యూఎంఎల్ చైర్మన్ కేపీ శర్మ ఓలీ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. NC అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా ఆయనచే ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

నేపాల్ పార్లమెంట్‌లో ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ విశ్వాస ఓటింగ్‌లో ఓడిపోడారు. 77 మంది సభ్యులు ఆయనకు మద్దతు ఇవ్వగా..  88 మంది నేపాలీ కాంగ్రెస్ సభ్యుల మద్దతు ఓలీకి తెలిపారు. మొదటి దశలో ఒప్పందం ప్రకారం.. ఓలీ 18 నెలల పాటు ప్రధానిగా ఉండి, ఆ తర్వాత మరొకరు బాధ్యతలు తీసుకుంటారు.