పెంబి, వెలుగు: వన్యప్రాణుల చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, అడవుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పెండి డిప్యూటీ రేంజర్ కె.ప్రతాప్ నాయక్ సూచించారు. వన్య ప్రాణుల చట్టాలపై పెంబి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని ఇటిక్యాల తండా ప్రజలకు శుక్రవారం అవగాహన కల్పించారు.
వన్య ప్రాణులకు హాని చేయొద్దని, వాటిని వేటాడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ కలప రవాణాకు పాల్పడితే వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామన్నారు. అటవీ శాఖ సిబ్బంది శివారెడ్డి, రవీందర్, సంతోష్, రవి తదితరులు పాల్గొన్నారు.