గోదావరిఖని, వెలుగు: రాబోయే పార్లమెంట్ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తారని సీపీఐఎంఎల్ మాస్‌లైన్ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు కె.రమ ఆరోపించారు. ఆదివారం గోదావరిఖనిలో పార్టీ ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పార్లమెంట్ ఎన్నికల జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో మోదీ ప్రభుత్వం ఫాసిస్టు పాలన కొనసాగిస్తున్నారన్నారు.
దేశ సంపదను కార్పొరేట్ శక్తుల్లో కేంద్రీకరించే విధంగా మోదీ నిర్ణయాలు ఉన్నాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటమే ధ్యేయంగా విప్లవశక్తులంతా కలిసి పనిచేయాలన్నారు. మీటింగ్‌లో లీడర్లు జూపాక శ్రీనివాస్, నంది రామయ్య, గుజ్జుల సత్యనారాయణరెడ్డి, జాడి దేవరాజ్, జిందం రాంప్రసాద్, తోకల రమేశ్, వెంకన్న, శంకర్ పాల్గొన్నారు.