రాజన్న జోన్ కొత్త డీఐజీగా కె.రమేష్ నాయుడు

రాజన్న జోన్ కొత్త డీఐజీగా కె.రమేష్ నాయుడు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజన్న జోన్ కొత్త డీఐజీగా కె.రమేష్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. కరీంనగర్ కేంద్రంలోని డీఐజీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు రాజన్న జోన్ ఇంఛార్జి డీఐజీగా కరీంనగర్ సీపీ సత్యనారాయణ విధులు నిర్వహించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన రమేష్ నాయుడికి... సీపీ సత్యనారాయణ, డీసీపీ శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ చంద్రమోహన్‭తో పాటు ఇతర పోలీసు అధికారులు అభినందనలు తెలిపారు. మరోవైపు రెండు రోజుల క్రితం రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‭లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 29 మంది ఐపీఎస్‭లను బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.