
మహబూబాబాద్ జిల్లాలో కురిసిన భారీవర్షానికి కే సముద్రం వ్యవసాయ మార్కెట్ లో మక్కలు తడిసి మద్దయ్యాయి. తేమ పేరుతో మూడు రోజుల ( సెప్టెంబర్ 21 వరకు) నుంచి ధాన్యాన్ని అధికారులు కొనుగోలుచేయలేదు. మార్కెట్ లో పోసిన మక్కలను ఆరబెట్టేందుకు తడిసిన ధాన్యాన్ని ట్రాక్టర్ లో నింపుకుంటున్నారు. వర్షాల విషయంలో అధికారులకు ముందస్తు సమాచారం ఉన్న వ్యవపాయ మార్కెట్ అధికారులు రైతులను అలర్ట్ చేయలేదని రైతులు ఆరోపిస్తున్నారు.తడిసిన మొక్కజొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.