న్యూఢిల్లీ: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)గా కె.సంజయ్ మూర్తి గురువారం ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండపంలో ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. 1989లో ఐఏఎస్‌గా హిమాచల్ ప్రదేశ్ కేడర్‌కు ఎంపికైన ఆయన ఆ తర్వాత కేంద్ర సర్వీస్‌లోకి వెళ్లారు.
ప్రస్తుతం కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సంజయ్ మూర్తి ఏపీలోని అమలాపురం మాజీ ఎంపీ కేఎస్‌ఆర్ మూర్తి కుమారుడు.ఇప్పటివరకు కాగ్ చీఫ్‌గా పనిచేసిన గిరీష్ చంద్ర ముర్ము పదవీకాలం బుధవారంతో పూర్తయింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, వాణిజ్యం, పీయూష్ గోయల్ తదితరులు హాజరయ్యారు.