జూన్ 1 నుంచి జరగబోయే టీ20వరల్డ్ కప్ కోసం బీసీసీఐ 15మంది సభ్యులతో కూడిన టీమ్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ టీమ్ లో యంగ్ డైనమిక్ రింకూ సింగ్ పేరు లేకపోవడం పట్ల పలువురు మాజీలు మండిపడుతున్నారు. తాజాగా భారత మాజీ సెలక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ టీమ్ సెలెక్షన్ పై అసహనం వ్యక్తం చేశారు. అసలు టీమ్ ఎంపికే సరిగ్గా లేదని ఆయన మండిపడ్డారు.
ప్రపంచమంతా రింకూ సింగ్ గురించి మాట్లడుకుంటుంటే అతన్ని ఎలా పక్కన పెడతారని ఫైరయ్యారు. తన దృష్టిలో జైస్వాల్ ను తొలగించి రింకూను తీసుకుంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తం టీమ్ ఎంపికలో రింకూను బలివశువును చేశారంటూ శ్రీకాంత్ సంచలన కామెంట్స్ చేశాడు. ఆయన చేసిన ఈ కామెంట్స్ కు పలువురు మాజీలతో పాటు రింకూ సింగ్ ఫ్యాన్స్ సపోర్ట్ గా నిలుస్తున్నారు. రింకూ సింగ్ గత సంవత్సర కాలంగా టీ20 ల్లో అత్యంత నిలకడగా ఆడవుతున్నాడు. అయినప్పటికీ రింకూ సింగ్ ను సెలక్టర్లు 15 మంది ప్రాబబుల్స్ లో ఎంపిక చేయలేదు.
ఇక ఈ మెగా టోర్నీ విషయానికి వస్తే... 2024 జూన్ 1 నుంచి 29 వరకు టీ20 వరల్డ్ కప్ అమెరికా, వెస్టిండిస్ వేదికగా జరుగనుంది. ఈ పొట్టి ప్రపంచకప్ కోసం దాదాపు 20 జట్లు పోటి పడుతున్నాయి. ఐసీసీకి పోటిపడే దేశాలు తమ జట్ల ఎంపిక కోసం మే 1 వరకు డెడ్ లైన్ విధించింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ తో పాటుగా పలు దేశాలు తమ జట్లను ప్రకటించాయి.
భారత్ మ్యాచ్ ల విషయానికి వస్తే ఐర్లాండ్ తో జూన్ 5 న తొలి మ్యాచ్ ఆడనుంది. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న భారత్, పాకిస్థాన్ జట్లు జూన్ 9 న న్యూయార్క్ సిటీలో తలపడనున్నాయి. జూన్ 12 న న్యూయార్క్ లో అమెరికాపై, 15 న కెనడాతో ఫ్లోరిడాలో భారత్ లీగ్ మ్యాచ్ లు ఆడుతుంది.
K Srikkanth (Chairman of Selection Committee of WC 2011) compares omission of Rinku Singh from 2024 T20WC with Rohit Sharma missing out from 2011 WC Squad.
— Vishwa (@itis_vishwa) May 1, 2024
"Rohit Sharma was not dropped by selection committee for 2011 WC. He unfortunately missed due to slot issues" - Srikkanth pic.twitter.com/7l3jhcQsFE