త్వరలో జర్నలిస్టులకు శిక్షణ తరగతులు : కె.శ్రీనివాస్ రెడ్డి

జనగామ అర్బన్/ హనుమకొండ సిటీ, వెలుగు: జర్నలిస్టులు నిత్య విద్యార్థుల్లా ఉంటూ కొత్త విషయాలను తెలుసుకోవాలని, త్వరలోనే శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జనగామలో టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు ఇర్రి మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి సురిగెల భిక్షపతి, ట్రెజరర్ సంతోష్​ ​ఆధ్వర్యంలో జనగామ జర్నలిస్టులు ఆదివారం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

 కాగా, ప్రెస్​అకాడమీ చైర్మన్​గా నియామకమైన తర్వాత తొలిసారిగా వరంగల్​కు వచ్చిన శ్రీనివాస్​రెడ్డిని గ్రేటర్​ వరంగల్ ​ప్రెస్​క్లబ్, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు వేముల నాగరాజు, బొల్లారపు సదయ్య, కోశాధికారి బోళ్ల అమర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్​రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇండ్ల స్థలాల విషయమై సీఎం దృష్టికి తీసుకెళ్లి, త్వరలో పంపిణీ జరిగేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో జర్నలిస్ట్​సంఘాల నాయకులు ఉన్నారు.