
ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ ఆర్టీసీ డీఎంగా కె. వి రాజశేఖర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని హెచ్‌సీయూ డిపోలో మెకానికల్ ఫోర్ మెన్ గా పని చేస్తూ ప్రమోషన్ పై ఆసిఫాబాద్ డీఎంగా వచ్చారు. గతంలో ఇక్కడ పనిచేసిన విశ్వనాథ్ బదిలీపై బోధన్ డిపోకు వెళ్లగా ఆయన స్థానంలో కె.వి. రాజశేఖర్ బాధ్యతలు స్వీకరించారు.