‘క’ సినిమాపై కిరణ్ అబ్బవరం కాన్ఫిడెన్స్ ఏ రేంజ్లో ఉందంటే..

‘క’ సినిమాపై కిరణ్ అబ్బవరం కాన్ఫిడెన్స్ ఏ రేంజ్లో ఉందంటే..

కిరణ్ అబ్బవరం హీరోగా,  నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్‌‌గా  నటించిన  సినిమా ‘క’. సుజీత్, సందీప్ దర్శకత్వంలో చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించారు. దీపావళి కానుకగా ఈనెల 31న సినిమా విడుదల కానుంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌‌‌‌కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘ఇదొక థ్రిల్లర్ మూవీ. గ్రిప్పింగ్ స్క్రీన్‌‌ప్లేతో ఆకట్టుకుంటుంది. నేను పోషించిన వాసుదేవ్ క్యారెక్టర్‌‌‌‌లో చాలా షేడ్స్ ఉన్నాయి. క్లైమాక్స్ సీన్స్ సర్‌‌‌‌ప్రైజ్ చేస్తాయి. ఇందులో ఏదైనా ఎలిమెంట్ గతంలో స్క్రీన్ మీద చూశామని ఎవరికైనా అనిపిస్తే నేను సినిమాలు చేయడం ఆపేస్తా’ అని చెప్పాడు. 

సినిమా రిలీజ్ కోసం ఎక్సయిటింగ్‌‌గా ఉన్నామని హీరోయిన్స్ నయన్ సారిక, తన్వీ రామ్ అన్నారు. డైరెక్టర్ సందీప్ మాట్లాడుతూ ‘ స్ర్కీన్‌‌ప్లే చాలా కొత్తగా ప్రెజెంట్ చేశాం. 1970–80 కాలాన్ని ప్రతిబింబించేలా ప్రతి సీన్ డిజైన్ చేసుకున్నాం. సినిమా బిగిన్ అయిన ఫస్ట్ మినిట్ నుంచే ‘క’ ప్రపంచంలోకి వెళ్తారు’ అని చెప్పాడు. ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి సక్సెస్‌‌పై కాన్ఫిడెంట్‌‌గా ఉన్నామని అన్నారు.