కాంగ్రెస్ పని అయిపోయింది:కేఏ పాల్

మునుగోడు ఉప ఎన్నిక సమయం దగ్గర పడుతున్నా కొద్దీ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. మునుగోడులో తాను గెలిస్తే వచ్చే ఎన్నికల్లో తెలంగాణకు తానే సీఎం అవుతానని చెప్పారు. కాంగ్రెస్ పని అయిపోయిందని ఆ పార్టీ పెద్దలు తనకే మద్దతు తెలుపుతున్నారని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నిరుద్యోగులను దారుణంగా మోసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు పేద ప్రజలకు అందడం లేదన్నారు. అందుకే అన్ని వర్గాలు టీఆర్ఎస్ పై ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. 

గద్దర్ ను మునుగోడు ప్రచారానికి రాకుండా టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారని కేఏ పాల్ ఆరోపించారు. పాత కేసులు మళ్లీ తిరగదోడతామని బెదిరించడంతో ఆయన మునుగోడు క్యాంపెయిన్ కు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ బరిలో నిలిచిన 47 మందిలో 43 మందికి డిపాజిట్ రాదని జోస్యం చెప్పారు. తనకు అవకాశం ఇస్తే మునుగోడును ఆరు నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు.