రేవంత్ రెడ్డి నాకే ఓటు వేస్తారు అవసరమైతే కలిసి పనిచేస్తాం: కేఏ పాల్

రేవంత్ రెడ్డి నాకే ఓటు వేస్తారు  అవసరమైతే కలిసి పనిచేస్తాం: కేఏ పాల్

సీఎం రేవంత్ రెడ్డి తనకే ఓటు వేస్తారని.. అవసరమైతే కలిసి పని చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.  సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ఓ కార్యక్రమానికి హాజరైన కేఏ పాల్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాలలో యుద్దాలను ఆపే శాంతి దూతగా పనిచేశానని అన్నారు. 

అన్ని కులాలను,మతాలను గౌరవించటం నేర్చుకోవాలని.. రాముడు కరోనా ప్రియుడని కత్తి మహేశ్ దూషించటాన్ని ఖండించానని అన్నారు.ప్రవీణ్ పగడాలను తాగుబోతుగా చిత్రీకరించటం ఘోరమని అన్నారు కేఏ పాల్.

197 దేశాల ప్రధానులు తనను ప్రధానిగా కోరుకుంటున్నారని.. 25 వేల మంది క్రిస్టియన్లు 15 వేల‌మంది ముస్లీంలు, 12 వేల మంది హిందువులకు వేల కోట్ల రూపాయలు ఫించన్లు అందించామని అన్నారు.18 పార్టీల సహకారం తనకు ఉందని.. 38 మంది బీజేపీ ఎంపీలు తనను ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారని అన్నారు కేఏ పాల్. ప్రపంచ దేశాలలోని డిక్టేటర్లు కూడా తన అనుచరులే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్.