పంజాగుట్ట, వెలుగు: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులకు ఆయన పిర్యాదు చేశారు.
తిరుపతి లడ్డూ వ్యవహరంలో పవన్ కల్యాణ్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పాల్ తన ఫిర్యాదులో వెల్లడించారు. దాని వల్ల సమాజంలో అశాంతి వాతావరణం ఏర్పడిందన్నారు. వెంటనే పవన్ పై చర్యలు తీసు కోవాలని కోరారు. తన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేసి.. పవన్‌పై ఎఫ్ఐఅర్ నమోదు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.