పవన్ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాలి.. కేఏ పాల్కు ఎందుకింత కోపమొచ్చిందంటే..

పవన్ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాలి.. కేఏ పాల్కు ఎందుకింత కోపమొచ్చిందంటే..

హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పదవి నుంచి పవన్ కళ్యాణ్ను తక్షణమే డిస్ క్వాలిఫై చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పవన్పై 14 సెక్షన్ల కింద గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ తరపున ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పిచ్చి కుక్క కరిచినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయన మాటలు దేశంలో శాంతి, సామరస్యాలను దెబ్బ తీసేవిగా ఉన్నాయని అన్నారు. మొత్తం14 సెక్షన్లను పవన్ కళ్యాణ్ ఉల్లంఘించారని అన్నారు.

ALSO READ | విశాఖ ఉక్కు ముఖ్యమా.. బీజేపీతో పొత్తు ముఖ్యమా.. తేల్చుకోండి చంద్రబాబు: షర్మిల ట్వీట్

అయోధ్య రామాలయ కార్యక్రమానికి కల్తీ జరిగిన లక్షల లడ్డూలను పంపించారన్న ఆరోపణ తీవ్ర నేరమని అన్నారు.  అయోధ్య కార్యక్రమం జరిగింది జనవరిలో అయితే కల్తీ విషయం బయటపడ్డది ఆయన డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న జూలైలో అని అన్నారు. పంజాగుట్ట పోలీసులతో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి,  ప్రధాని నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, సి.బి.ఐ లకు ఫిర్యాదు కాపీలను పంపనున్నట్లు తెలిపారు.