బెట్టింగ్ యాప్స్ డ్రగ్స్ కంటే డేంజర్.. సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసిన కేఏ పాల్

బెట్టింగ్ యాప్స్ డ్రగ్స్ కంటే డేంజర్.. సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసిన కేఏ పాల్

బెట్టింగ్ యాప్స్ పై యూట్యూబర్ అన్వేష్ స్టార్ట్ చేసిన పోరాటం జాతీయస్థాయిలో సంచలనం రేపుతోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఇప్పటికే పలువురు యూట్యూబర్లు, టాలీవుడ్ స్టార్లపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదిలా ఉండగా..ఇప్పుడు సీన్ లోకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎంటరయ్యారు. బెట్టింగ్ యాప్స్ పై సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు కేఏ పాల్. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్.

బెట్టింగ్ యాప్స్ డ్రగ్స్ కంటే ప్రమాదకరమైనవి అని... ప్రతి ఇంట్లో అరచేతిలో ఉండే ఫోన్లోనే లభిస్తాయని అన్నారు.తెలంగాణలో యాప్స్ పై బ్యాన్ ఉన్నప్పటికీ 978 మంది చనిపోయినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయని అన్నారు కేఏ పాల్.క్రీడాకారులు, సినీ నటులను యువత రోల్ మోడల్ గా తీసుకుంటారని..  కానీ వారంతా సైతాన్లుగా మారారని అన్నారు. పరోక్షంగా ఇంత మంది చావులకు కారణమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేఏ పాల్.

ALSO READ | నాకు హోంశాఖ అంటే ఇష్టం..కేబినెట్ విస్తరణపై రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు

బెట్టింగ్ యాప్స్ ద్వారా రూ. 7 - 14వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వాలు మిన్నకున్నాయని ఆరోపించారు కేఏ పాల్. అంతకంటే ఎక్కువ నిధులు నేను తెచ్చి పెడతానని అన్నారు. అన్ని మనీ గేమింగ్ యాప్స్‌ను తక్షణమే బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు కేఏ పాల్. 
72 గంటల్లోగా సెలబ్రిటీలు ముందుకొచ్చి క్షమాపణ చెప్పాలని... నష్టపోయినవారికి పరిహారం ఇప్పించాలని అన్నారు.సెలబ్రిటీలు ఎవరినీ వదిలిపెట్టనని... ఇది బెదిరింపు కాదు, ఈడ్చుకెళ్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కేఏ పాల్.