![నా పార్టీకి గుర్తెందుకివ్వరు?: కేఏ పాల్ ఆవేదన](https://static.v6velugu.com/uploads/2023/11/ka-paul-meets-ec-in-delhi-over-party-symbol_Zc6mOWGPNU.jpg)
- నా పార్టీకి గుర్తెందుకివ్వరు?
- నామినేషన్ కు మరో రెండు గడువు ఇవ్వాలి
- ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్
హైదరాబాద్: తమ పార్టీకి ఇంకా ఎన్నికల గుర్తు కేటాయించకపోడంపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ గుర్తు కేటాయించకుండా అధికారులు వేధిస్తున్నారని అన్నారు. పార్టీకి గుర్తు కేటాయించాలని గురువారం ఆయన కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. సెప్టెంబర్ లోనే అన్ని డాక్యుమెంట్లు ఇచ్చిన ఇంతవరకు గుర్తు కేటాయించలేదని ఈసీకి విన్నవించారు. అనంతరం మాట్లాడిన కేఏ పాల్.. ఎన్నికల సంఘాన్ని కేసీఆర్ నడుపుతున్నారో, ఎన్నికల కమిషనర్ నడుపుతున్నాడో అర్థం కావడంలేదన్నారు.
ప్రజా శాంతి పార్టీకి గుర్తు వెంటనే కేటాయించి, నామినేషన్లకు మరో రెండు రోజులు సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోటీ చేయని వైస్సార్ తెలంగాణ పార్టీ కి కూడా గుర్తు కేటాయించారని.. మాకు మాత్రం కేటాయించడం లేదని ఫైర్ అయ్యారు. 'తెలంగాణ ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు, ప్రచారం చేసేందుకు సమయం కేటాయించాలనే నేను పోటీకి దూరంగా ఉన్నా. గొర్రెలు కసాయి వారిని నమ్మినట్లే ప్రజలు అవినీతిపరులను ఎన్నుకుంటున్నారు. చట్టాలు మారాలంటే నాలాంటి వాడు ఎంపీ అవ్వాలి. నా పోరాటంతోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపేసాను.' అని కేఏ పాల్ అన్నారు.