- కానీ బీజేపీ 40 సీట్లు డిమాండ్ చేస్తోందిరేవంత్రెడ్డి ఎక్కడ
- పోటీ చేసినా గెలవడువామపక్షాలతో చర్చలు జరుపుతున్నాం
- ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కామెంట్
నిజామాబాద్, వెలుగు: ధరణి పోర్టల్కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.12 లక్షల కోట్లు అప్పు చేసిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ఆరోపించారు. కేసీఆర్దోచేసిన రూ.24 లక్షల కోట్లతో ఎలక్షన్లకు వస్తున్నారన్నారు. బుధవారం రాత్రి నిజామాబాద్‌లో పాల్ మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటే, వడ్డీలు కట్టలేని స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌పార్టీలు వచ్చే ఎన్నికల్లో పరస్పరం సహకరించుకుంటాయని చెప్పారు.
మహిళా బిల్లును డిమాండ్‌చేసిన బీఆర్ఎస్ ఇటీవల ప్రకటించిన లిస్టులో కేవలం ఏడుగురు మహిళలకే చాన్స్ఇచ్చిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్అధికారంలోకి రాదని, ఒకవేళ 10 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే బీఆర్ఎస్లోకి వెళ్లిపోతారన్నారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లిన రేవంత్‌రెడ్డి ఎక్కడ పోటీ చేసినా గెలవడని విమర్శించారు. కాంగ్రెస్‌లోని ముగ్గురు ముఖ్య లీడర్లను కేసీఆర్ పోషిస్తున్నారని, జమిలీ ఎలక్షన్స్‌కు కేసీఆర్ ఒప్పుకోకపోవడంతోనే ఎమ్మెల్సీ కవితకు తాజాగా ఈడీ నోటీసులు వచ్చాయన్నారు. బీజేపీకి 20 అసెంబ్లీ సీట్లు సర్దుబాటు చేసేందుకు కేసీఆర్సిద్ధంగా ఉన్నా, బీజేపీ 40 స్థానాలు కోరుతోందన్నారు. పాలమ్మినా.. పూలమ్మినా అని చెప్పే మంత్రి మల్లారెడ్డి మాటలు శుద్ధ అబద్ధాలని ఎద్దేవా చేశారు.
ఐఏఎస్, ఐపీఎస్‌ల మాదిరిగా ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబునాయుడుకు పొలిటికల్రిటైర్మెంట్ఇవ్వాలని చెప్పారు. కాంగ్రెస్‌పార్టీ లీడర్లు మధుయాష్కీగౌడ్, షబ్బీర్‌అలీ, బీజేపీ ఎంపీ అర్వింద్ప్రజాశాంతి పార్టీలో చేరాలని కోరారు. ఈవీఎంలు లేని ఎలక్షనే లక్ష్యంగా పోరాటం చేస్తున్నానని కేఏ పాల్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 119 అసెంబ్లీ స్థానల్లోనూ పోటీ చేస్తామని స్పష్టం చేశారు. సీపీఎం, సీపీఐ, ఎంఐఎంతో కలిసి ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన ఉందన్నారు. వామపక్షాలకు పది చొప్పున సీట్లు, మజ్లిస్‌కు ఏడు స్థానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వామపక్షాలతో ప్రస్తుతం చర్చలు జరుపుతున్నామన్నారు. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తే 6 నెలల్లో రూ.6 లక్షల కోట్లు తెస్తానని, లేకుంటే నడిరోడ్డుపై తనను ఉరి తీయాలన్నారు. అక్టోబర్2న హైదరాబాద్జింఖానా గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.