మేఘా కృష్ణారెడ్డి అవినీతి..ప్రాజెక్టులు మూలన పడ్డాయి : కేఏ పాల్ 

  • ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్  

న్యూఢిల్లీ, వెలుగు: మేఘా కృష్ణారెడ్డి అవినీతికి కారణమైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మూలపడ్డాయని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. కేసీఆర్ హయాంలో లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం మూతపడిందన్నారు. ఈ ప్రాజెక్టుకు ఏడాదికి రూ.15 వేల కోట్ల వడ్డీ భారాన్ని తెలంగాణ ప్రభుత్వం భరిస్తోందని చెప్పారు.

అలాగే, గత నాలుగేండ్లుగా ఏపీలోని పట్టిసీమ ప్రాజెక్టు కరెంటు బిల్లులు కట్టలేక మూతపడిందన్నారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌లో మీడియాతో కేఏ పాల్‌‌ మాట్లాడారు. ఏపీలో మరో కాళేశ్వరంగా నదుల అనుసంధాన కార్యక్రమం మారిందని, గ్రావిటీతో నదుల అనుసంధానం కావాలే గానీ, ఎత్తిపోతలతో అనుసంధానం ఒక జోక్ అని చెప్పారు.