ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు సీజేను సీఎం కేసీఆర్ కలవడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ రిట్ పిటిషన్ విచారణకు రానున్న తరుణంలో సీఎం కేసీఆర్, హైకోర్టు సీజేను కలవడం అసహజ పరిణామమని పాల్ వ్యాఖ్యానించారు. దీనిపై సుప్రీంకోర్టు సీజేఐకి లేఖ రాసినట్లు వెల్లడించారు. తనకు దాదాపు 120 మంది మేధావుల మద్దతు ఉందన్నారు.
ఈ వ్యవహారంపై తాను సిద్ధం చేసిన పిటిషన్ పై ఇప్పటికే దాదాపు 78వేల మంది సంతకం చేశారని తెలిపారు. గతంలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె సమయంలోనూ సీఎం కేసీఆర్.. అప్పటి చీఫ్ జస్టిస్ ను కలవడం వివాదాస్పదమైందన్నారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో కేఏపాల్ ఈ కామెంట్స్ చేశారు.