మునుగోడులో పోటీపై కేఏ పాల్ సంచలన కామెంట్స్

నల్గొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ అభ్యర్థిగా ఉప ఎన్నిక బరిలోకి దింపాలనుకున్న ప్రజా కవి గద్దర్ నామినేషన్ వేయకుండా సీఎం కేసీఆర్ అడ్డుకున్నాడని ఆరోపించారు. చండూరులో ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయం వద్ద కే ఏ పాల్ వీ6 ప్రతినిధితో మాట్లాడారు.

మునుగోడు ఉప ఎన్నికలో తాను పోటీలోనే ఉన్నానని అందుకే ప్రచారంలో పాల్గొంటున్నానని కేఏ పాల్ స్పష్టం చేశారు. బరిలో ఎంత మంది ఉన్నా.. ప్రధాన పోటీ మాత్రం తనకు, టీఆర్ఎస్ కు మధ్యనే ఉంటుందని అన్నారు. ‘‘నిన్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసి ఈ ఒక్కసారి పోటీ నుంచి తప్పుకోమని కోరినట్లు కేఏ పాల్ చెప్పారు. మునుగోడు ప్రజలు  ఒక్కసారి తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అమెరికా స్థాయికి తీర్చిదిద్దుతానని కేఏ పాల్ హామీ ఇచ్చారు. మునుగోడులో పోలీసులు తమను అడుగడుగునా అడ్డుకుంటున్నారని,  అధికార పార్టీకి అనుకూలంగా  పనిచేస్తున్నారని మండిపడ్డారు.