నా జోలికొస్తే ఏ సీఎంనూ వదల..జైల్లో వేయిస్తా: కేఏ పాల్

నా జోలికొస్తే ఏ సీఎంనూ వదల..జైల్లో వేయిస్తా: కేఏ పాల్

సీఎం రేవంత్ రెడ్డి తొమ్మిది నెలల పాలనలో   ఒక్క కొత్త కంపెనీని తీసుకురాలే..ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్.  రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో  హంగామా చేస్తున్నారని  విమర్శించారు. తన జోలికొస్తే  రేవంత్ రెడ్డి, చంద్రబాబును జైల్లో వేయిస్తానని అన్నారు. ఓటుకు నోటు కేసులో ఒక్క  కేసు వేస్తే  ఇద్దరు జైల్లో ఉంటారని చెప్పారు. 

పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద హైకోర్టులో పిల్ వేశానన్నారు కేఏపాల్. సంతలో పశువులు అమ్ముడుపోయినట్టు ఎమ్మెల్యేలు అమ్ముడుపోతున్నారని విమర్శించారు.  రేవంత్ రెడ్డి.. కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోరని విమర్శించారు.  కేసీఆర్ పార్టీకి ఓనర్.. రేవంత్ రెడ్డి పార్టీలో వర్కర్ అని చెప్పారు. రేవంత్ రెడ్డి అమెరికాకు  వెళ్తే అక్కడ ఎవరు గుర్తుపట్టలేదన్నారు.

ALSO READ | పార్టీ మార్పుపై మాజీ మంత్రి రోజా కీలక ప్రకటన

కర్ణాటకలో ఫ్రీ బస్సులో ఎలాంటి రూల్స్ లేవు కానీ తెలంగాణలో  రూల్స్ పెట్టారని విమర్శించారు కేఏపాల్.  సెక్రెటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు తెలంగాణ అమరవీరుల విగ్రహాలు.. స్వర్గీయ ప్రధాన మంత్రుల విగ్రహాలు పెట్టొచ్చు కదా అని ప్రశ్నించారు.  తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు కేఏ పాల్.