మునుగోడు ఉపఎన్నికపై ఎన్నికల అధికారులకు కేఏ పాల్ ఫిర్యాదు

మునుగోడు ఉపఎన్నికపై కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులను కలిసి ఫిర్యాదు చేశానని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు. కేసీఆర్, కేటీఆర్ లు అవినీతికి పాల్పడ్డారన్న ఆయన.. మునుగోడు ఎన్నికల్లో అవినీతిపై డాక్యుమెంటరీ, మీడియా, అధికారుల స్టేట్మెంట్స్, అన్ని ఆధారాలను ఈసీఐకి ఇచ్చామన్నారు. హిమాచల్ ఎన్నికల తర్వాత యాక్షన్ తీసుకుంటామని అధికారులు చెప్పినట్టు పాల్ వెల్లడించారు. మునుగోడు ఎన్నికల్లో అధికారులు అవినీతికి పాల్పడ్డారని, త్వరలోనే హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ లకు దేవుడి, లీగల్ పనిష్మెంట్లు ఉంటాయన్నారు.

మునుగోడు ఎన్నికల్లో ఈవీఎంలను రీప్లేస్ చేశారని కేఏ పాల్ ఆరోపించారు. బీజేపీకి 12 వేల ఓట్లనుంచి 80 వేల ఓట్లు ఎలా పెరిగాయని నిలదీశారు. రిజల్ట్ రాగానే మూడు రోజుల్లో ఢిల్లీకి వచ్చానన్న ఆయన.. వెంటనే ఈసీఐకి ఫిర్యాదు చేశానని చెప్పారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ గుండాలాగా ఎస్పీ పనిచేశారని ఆరోపించారు. రాష్ట్ర, జిల్లా ఎన్నికల అధికారులు అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. తనకు మరీ 800 ల ఓట్లా వస్తాయన్నారు. తన కనీసం 30 వేలో, 40 వేలో వచ్చినా ఈ అనుమానాలు రాకపోయేవని తెలిపారు.