
అమరావతి: ఏపీలో సంచలనం సృష్టిస్తోన్న పాస్టర్ ప్రవీణ్ మృతిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హాట్ కామెంట్స్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ మరణంపై అనుమానాలున్నాయి.. ప్రమాదం జరిగిన చోట ఉన్న సీసీ పుటేజ్‌ను పోలీసులు ఎందుకు రిలీజ్ చేయడం లేదు. ప్రవీణ్ పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మతాల గురించి అనవసరంగా మాట్లాడటం వల్లే ఇలాంటి ఘటనలు జరగుతున్నాయని ఆరోపించారు. ప్రవీణ్ ఘటనపై సీఎం చంద్రబాబు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది రాష్ట్ర పేరును దెబ్బ తీసే ఘటన అని.. మిలియన్ల మంది క్రైస్తవులలో అనుమానాలు ఉన్నాయని తెలిపారు. మణిపూర్‌లో కూడా ఇలాంటి ఘటనలు వందలు జరిగాయని.. ఇలాంటి చర్యలు ఆంధ్రప్రదేశ్‌లో జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ALSO READ | శ్రీశైలం భ్రమరాంభికకు పుట్టింటిసారె..పాదయాత్రగా మల్లన్న సన్నిధికి చేరుకుంటున్న కన్నడిగులు
ప్రవీణ్ కేసును సుప్రీం కోర్టు, హైకోర్టు సుమోటోగా తీసుకుని దర్యాప్తు చేపట్టాలన్నారు. ప్రవీణ్ కేసును పోలీసులు పారదర్శకంగా విచారణ చేయాలని.. మీరు తప్పుడు విచారణ చేస్తే దేవుడు మిమ్మల్ని లేపేస్తాడని పోలీసులను హెచ్చరించారు. ఇది యాక్సిడెంట్ కాదని మేము అనుకుంటున్నామని.. ఎవరు చేయించారో వెంటనే వారిని అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రవీణ్ విషయంలో రాజకీయం చేయకండని.. అలా చేస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరని అన్నారు.