కాలంతో కనెక్ట్ అయ్యేలా..కాలం రాసిన కథలు

యమ్.యన్.వి సాగర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కాలం రాసిన కథలు’. నూతన నటీనటులతో  తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. దీనికొస్తున్న రెస్పాన్స్ తెలియజేసేందుకు టీమ్ ప్రెస్‌‌మీట్ నిర్వహించింది.

దర్శక నిర్మాత సాగర్ మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం గత రెండు సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నా. సినిమా విడుదల అయ్యాక ప్రేక్షకుల స్పందన బాగుంది. ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతున్నారు.

చిన్న సినిమాల్లో మాది  మంచిగా రాణిస్తుంది. ఈ సందర్భంగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అని చెప్పాడు. ఈ చిత్రంలో భాగమైనందుకు సంతోషంగా ఉందని నటీనటులు అన్నారు.