1950 మద్రాస్‌‌లో.. దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ మూవీ ‘కాంత’ సినిమా స్టోరీ ఇదే..

1950 మద్రాస్‌‌లో.. దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ మూవీ ‘కాంత’ సినిమా స్టోరీ ఇదే..

మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ లాంటి వరుస చిత్రాలతో  తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఆదివారం ఆయన నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం ప్రారంభోత్సవం జరగగా, సోమవారం మరో చిత్రంలోని ఫస్ట్ లుక్‌‌తో ఇంప్రెస్ చేశాడు. ‘కాంత’ టైటిల్‌‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సెల్వమణి సెల్వరాజ్ రూపొందిస్తున్నాడు.  రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ కలిసి నిర్మిస్తున్నారు.

దుల్కర్ సినీ ప్రయాణం 13 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంత మూవీ నుంచి కొత్త పోస్టర్స్‌‌ను రిలీజ్ చేశారు. ఇందులో వింటేజ్ గెటప్‌‌లో  ఇంటెన్స్‌‌గా కనిపిస్తున్నాడు దుల్కర్.  1950 మద్రాస్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో దానికి తగ్గట్టుగానే డిజైన్ చేసిన ఈ పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో  భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌‌గా నటిస్తోంది. సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తయింది.  ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.