ఇటీవల రజనీకాంత్ ‘జైలర్’ సినిమా నుంచి ‘కావాలయ్యా..’ అనే సాంగ్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పాటతో తమన్నా(Tamannaah) మరోసారి ట్రెండింగ్‌గా మారింది. లేటెస్ట్ గా తెలుగు వెర్షన్ 'నువ్వు కావాలయ్యా సాంగ్' ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటను శ్రీసాయి కిరణ్ రచించగా.. సింధూజ శ్రీనివాసన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవి చందర్ ఆలపించారు.
'వన్నెలే నీవయ్యా.. చూసుకో నచ్చాయా' అంటూ ఉన్న రాసిన రొమాంటిక్ లిరిక్స్ తో సాంగ్ మెస్మరైజ్ చేస్తోంది. ఇందులో తమన్నాతళుకులకు..డ్యాన్స్ లోని హావభావాలకు కుర్రకారు ఊగిపోతుంది. ఈ ఒక్క సాంగ్‌తో ఈ ముద్దుగుమ్మ మరిన్ని ఆఫర్లు అందుకుంటోందని టాక్ వినిపిస్తోంది.
సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఆగస్టు 10న విడుదలకు రెడీ కానుంది. ఇటీవల ఈ సాంగ్ విడుదలై 2 కోట్ల వ్యూస్‌ను దక్కించుకుంది.