కబడ్డీ.. గ్రౌండ్‌‌‌‌లో ఆట..బయట ఆడితే వేట

‘క‌‌‌‌బ‌‌‌‌డ్డీ.. మైదానంలో ఆడితే ఆట‌‌‌‌.. బ‌‌‌‌య‌‌‌‌ట ఆడితే వేట’ అంటున్నాడు గోపీచంద్. తను హీరోగా నటిస్తున్న ‘సీటీమార్’ టీజ‌‌‌‌ర్‌‌‌‌ను నిన్న విడుదల చేశారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత. కబడ్డీ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో ఈ సినిమా తీస్తున్నట్టు మొదటి నుండీ
చెబుతున్నారు. టీజర్ చూస్తుంటే మాత్రం ఇది కేవలం స్పోర్ట్స్ బేస్డ్ మూవీ కాదు, కమర్షియల్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌ కూడానని అర్థమవుతోంది. మహిళల కబడ్డీ జట్టు కోచ్‌‌‌‌లుగా గోపీచంద్, తమన్నా కనిపించారు. ‘రేయ్ కార్తీ’ అని రావు ర‌‌‌‌మేష్ పిల‌‌‌‌వ‌‌‌‌ గానే..  ‘అలా పిల‌‌‌‌వాలంటే ఒక‌‌‌‌టి మా ఇంట్లోవాళ్లు పిల‌‌‌‌వాలి లేదా నా ఫ్రెండ్స్ పిల‌‌‌‌వాలి. ఎవ‌‌‌‌డు ప‌‌‌‌డితే వాడు పిలిస్తే వాడి కూత ఆగిపోద్ది’ అంటూ గోపీచంద్ చెప్పిన పంచ్ డైలాగ్ ఆకట్టుకుంది. ఆట, వేట అనే డైలాగ్‌‌‌‌కి కూడా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మణిశర్మ మార్క్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ స్టైలిష్ యాక్షన్ సీన్స్‌‌‌‌ని మరింత ఎలివేట్ చేసింది. విలన్ కబడ్డీ కూతతో మొదలై, గోపీచంద్ విజిల్‌‌‌‌తో ముగిసిన టీజర్ మాస్ ఆడియెన్స్ చేత ‘సీటీమార్’ అనిపించేలా ఉంది. భూమిక‌‌‌‌, దిగంగ‌‌‌‌నా సూర్యవంశీ, పోసాని, రావు ర‌‌‌‌మేష్‌‌‌‌‌‌‌‌, రెహ‌‌‌‌మాన్, త‌‌‌‌రుణ్ అరోరా ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అప్సరా రాణి స్పెషల్ సాంగ్ చేస్తోంది. ఏప్రిల్‌‌‌‌ 2న ఈ సినిమా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి 

పార్కును కబ్జా చేసి.. గోడ కడుతున్నరు

గ్రేటర్‌లో డీపీఎంఎస్ సేవలకు త్వరలో పుల్‌స్టాప్

అక్కడ రోడ్లపై చెత్త వేస్తే రూ. 5 వేలు ఫైన్    

చెరువుల కబ్జాలపై ఏం చేశారో రిపోర్ట్‌‌‌‌ ఇవ్వండి