Dakshina Movie: కబాలి ఫేమ్ సాయి ధన్సిక సైకో కిల్ల‌ర్ మూవీ.. సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌తో మంత్ర డైరెక్ట‌ర్‌

Dakshina Movie: కబాలి ఫేమ్ సాయి ధన్సిక సైకో కిల్ల‌ర్ మూవీ.. సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌తో మంత్ర డైరెక్ట‌ర్‌

సాయి ధన్సిక ఫిమేల్ లీడ్‌‌‌‌‌‌‌‌గా నటించిన చిత్రం ‘దక్షిణ’. ఓషో తులసీరామ్ దర్శకత్వంలో అశోక్ షిండే నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌కు అతిథులుగా హాజరైన నటుడు శివాజీ, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.

సాయి ధన్సిక మాట్లాడుతూ ‘అమ్మాయిలంతా స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌గా ఉండాలనే పాయింట్‌‌‌‌‌‌‌‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. సినిమా చాలా గ్రిప్పింగ్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది.  సూపర్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి’ అని చెప్పింది.

ఓషో తులసీరాం మాట్లాడుతూ ‘నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్.  నాకు శివాజీ గారికి ‘మంత్ర’ సినిమా సమయంలో ఎన్నో మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. ఇందులో సాయి ధన్సిక  పర్ఫెక్ట్‌‌‌‌‌‌‌‌గా నటించింది. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా’ అన్నాడు. టీమ్ అంతా పాల్గొన్నారు.