గోవాలో ‘కబాలి’ నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య

గోవాలో ‘కబాలి’ నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య

హైదరాబాద్: ‘కబాలి’ సినిమా తెలుగు నిర్మాత, డ్రగ్స్ వ్యవహారంలో పీకల్లోతులో మునిగి విమర్శల పాలైన కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్నాడు. గోవాలో కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్నాడు. కేపీ చౌదరి అనారోగ్య కారణాలతో, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కేపీ చౌదరి పూర్తి పేరు కృష్ణ ప్రసాద్ చౌదరి. 2016 లో సినిమా రంగంలోకి వచ్చాడు. అతడు ‘కబాలి’ సినిమా తెలుగు వెర్షన్కు నిర్మాతగా వ్యవహరించాడు. అంతేకాకుండా పలు  తెలుగు, తమిళ చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్గా పనిచేశాడు.

సర్దార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశాడు. సినీ రంగం కేపీ చౌదరికి పెద్దగా కలిసిరాలేదు. సినీ రంగంలో చేతులు కాల్చుకున్న కేపీ చౌదరి ఆ నష్టాలను పూడ్చుకోవడానికి డ్రగ్స్ దందాలోకి దిగాడు. ఇందులో భాగంగానే గోవాలో OHM పబ్ను స్టార్ట్ చేశాడు. గోవాకు వచ్చిన సెలబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేసేవాడు. 

ఇలా టాలీవుడ్ సెలబ్రెటీలు చాలామందితో కేపీకి సాన్నిహిత్యం ఏర్పడింది. పబ్ బిజినెస్లో కూడా నష్టాలు రావడంతో కేపీ చౌదరి హైదరాబాద్కు తిరిగొచ్చాడు. గోవా నుంచి వస్తూ 100 ప్యాకెట్ల కొకైన్ తీసుకువచ్చాడు. పలు సినీ తారలతో సంబంధాలున్నాయని అప్పట్లో కేపీ చౌదరి పేరు మోత మోగిపోయింది. సెలబ్రెటీలతో హగ్గులు, ముద్దులు.. ఇలా పలువురు లేడీ యాక్టర్స్తో కేపీ చౌదరి చాలా సన్నిహితంగా ఉన్న ఫొటోలు అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి. ఒక పబ్ ఓనర్గా మాత్రమే తమకు కేపీ చౌదరి తెలుసని, డ్రగ్స్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని అప్పట్లో కొందరు టాలీవుడ్ సెలబ్రెటీలు చెప్పుకొచ్చారు.

అసలు ఈ కేపీ చౌదరి బ్యాగ్రౌండ్ ఏంటంటే..
* డ్రగ్స్  కేసులో గతంలో అరెస్ట్ అయిన కేపీ చౌదరి
* పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన కేపీ చౌదరి
* డ్రగ్స్ క్రయవిక్రయాలు చేసిన కేసుల్లో కేపీ చౌదరి అరెస్ట్
* తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న కేపీ చౌదరి
* ఇవాళ ఉదయం (ఫిబ్రవరి 3, 2025) పోలీసులు వెళ్లేసరికి విగతజీవిగా పడి ఉన్న కేపీ చౌదరి
* కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన గోవా పోలీసులు