అదృష్టం ఎప్పుడు.. ఎవరిని ఎలా వరిస్తుందనేది చెప్పలేం. దేవుడు మీ పక్కనున్నారంటే, రాత్రికి రాత్రే లక్షాధికారి కాదు కోటీశ్వరులు అవ్వొచ్చు. ఏ బ్యాంకు దోచేస్తేనో తప్ప అది జరగని పనిలే అనుకోకండి. అదొక్కటే దారి కాదు. అందుకు ఈ మత్స్యకారుడే ఓ ఉదాహరణ. నమ్ముకున్న గంగా తల్లే అతన్ని లక్షాధికారి చేసింది. అరుదైన చేప రుపంలో అతని వలకు చిక్కి కాసులు కురిపించింది.
కాకినాడ సముద్రతీరంలో ఆదివారం (ఫిబ్రవరి 02) 25 కిలోల బరువున్న అరుదైన కచిడి చేప ఓ మత్స్యకారుడి వలకు చిక్కింది. దానిని వేలం వేయగా రూ.3.95 లక్షలు పలికింది. దాంతో, సదరు మత్స్యకారుడి ఇంట ఆనందం వెల్లివిరిసింది. కచిడి చేపల్లో ఔషధ గుణాలు ఉంటాయని, అందుకే వీటికి ఇంత డిమాండ్ ఉంటుందని మత్స్యకారులు చెప్తున్నారు.
ALSO READ | పెళ్లంటేనే భయపడేలా చేస్తున్నరుగా.. ఇదేం పాడు బుద్ధి.. 10 మంది బతుకులు ఆగమాగం..