
కడప ఎమ్మెల్యే మాధవి పీఏ ఓ మహిళను మోపం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఉద్యోగం ఇప్పిస్తానని ఒంటరి మహిళను కడన ఎమ్మెల్యే పీఏ వాహిద్ పెళ్లి చేసుకున్నాడు. ఒంటరిగా ఉంటుందని.. ఆమెకు డబ్బు .. ఉద్యోగం కలుగజేస్తానని మాయ మాటలు చెప్పాడు వాహిద్. అంతేకాదు ఇతగాడు మరో ముగ్గురి అమ్మాయలను ట్రాప్ చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు.
వాహిద్ మోసాన్ని గుర్తించిన ఓ మహిళ న్యాయం చేయాలని కోరినందుకు ఆ మహిళ కుటుంబంపై దాడి చేశాడని ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని బాధిత మహిళ వాపోయింది. ఈ దాడిలో గాయపడిన మహిళ రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. బాధితురాలి బంధువులు తమకు న్యాయం చేయాలని కడప ఎమ్మెల్యే మాధవి ఇంటి వద్దకు వెళ్లారు.
►ALSO READ | ఉక్కు నగరంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు పాదయాత్ర..