ఖానాపూర్​లో డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలి : కడారు సురేందర్ రెడ్డి

ఖానాపూర్​లో డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలి : కడారు సురేందర్ రెడ్డి

నిర్మల్, వెలుగు: ఖానాపూర్​లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర గెజిటెడ్ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు కడారు సురేందర్ రెడ్డి డిమాండ్​ చేశారు. ఆదివారం నిర్మల్ లో డాక్టర్ కట్కం మురళి అధ్యక్షతన జరిగిన ఆ సంఘం ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తమ సంఘం కృషితో ఇప్పటికే ముథోల్, ఇచ్చోడలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఏర్పడ్డాయన్నారు.

డిగ్రీ అధ్యాపకులకు కూడా ప్రొఫెసర్ హోదా వచ్చేట్లు కృషి చేస్తున్నామన్నారు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల అధ్యాపకుల సమస్యల పరిష్కరించేందుకు తమ సంఘం నిరంతరం కృషి చేస్తోందన్నారు. సంఘ సలహాదారులు డాక్టర్ బెళ్లి యాదయ్య, డాక్టర్ రమేశ్, డాక్టర్ శ్రీరామ్, శంకరయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రవికుమార్, డాక్టర్ గంగాధర్, డాక్టర్ శంకర్, సంతోష్, అర్చన, సరిత, సంగీత తదితరులు పాల్గొన్నారు.