బీఆర్​ఎస్​కు కడెం ఎంపీపీ రాజీనామా

  •     బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్​లో చేరిక

కడెం, వెలుగు : బీఆర్ఎస్ కడెం ఎంపీపీ అలెగ్జాండర్, మద్దిపడగ సర్పంచ్ ప్రవీణ్ అధికార పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్​లో చేరారు. ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెడ్మ బొజ్జు పటేల్ సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు సుఖంగా లేరని, 9 ఏండ్ల పాలనలో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఎన్నికల్లో నియోజవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

అంతకుముందు కడెం మండలంలోని మద్దిపడగ గ్రామంలో బొజ్జు పటేల్ ఎన్నికల ప్రచారం నిర్వహించి కాంగ్రెస్​కు ఓటేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. మండల అధ్యక్షుడు తుమ్మల మల్లేశ్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పొద్దుటూరి సతీశ్ రెడ్డి, నాయకులు నరేందర్ రెడ్డి, ముస్కు రాజు, సత్యనారాయణ, రాహుల్, భూషణం, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : అన్నదమ్ములం కలిసి అభివృద్ధి చేస్తం : గడ్డం వినోద్​