నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ 15వ నంబర్ గేట్ రోప్ మంగళవారం తెగింది. దీంతో గోదావరి నీరంతా వృథాగా దిగువకు పోతున్నది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులోకి కొద్దిరోజులుగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు మంగళవారం ఉదయం ప్రాజెక్టు 15వ నంబర్ గేట్‌ను పైకెత్తి నీటిని దిగువకు వదిలారు.
ప్రవాహ ఉధృతి తగ్గడంతో మధ్యాహ్నం గేట్‌ను కిందకు దింపుతుండగా రోప్ తెగిపోయి కౌంటర్ వెయిట్ రిజర్వాయర్‌లో పడిపోయింది. దీంతో ఈ గేట్ నుంచి నీరు వృథాగా దిగువకు పోతోంది. గతేడాది వర్షాకాలంలో వచ్చిన వరదలకు కడెం ప్రాజెక్టు గేట్లు పూర్తిగా దెబ్బ తిన్నాయి.