ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుల్లోకి వరదనీరు పోటెత్తుతోంది. ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రస్తుతం ప్రాజెక్టు 2 గేట్లను ఎత్తి దిగువకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు.
జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 696 అడుగులకు చేరింది.
ALSO READ : సమ్మె చేస్తే డిస్మిస్ .. హోంగార్డులకు అధికారుల వార్నింగ్
జలాశయంలోకి 5, 329 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 263క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 7.6 టిఎంసీలు, ప్రస్తుత నీటి సామర్ద్యం 6.5 టిఎంసీలుగా ఉంది. ముంపు ప్రాంత వాసుల్ని అప్రమత్తం చేసినట్లు అధికారులు వెల్లడించారు.