కడెం ప్రాజెక్టు రోడ్డు మొత్తం గుంతలే.. 

కడెం ప్రాజెక్టు రోడ్డు మొత్తం గుంతలే.. 

కడెం వెలుగు: కడెం మండల కేంద్రంలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు మీద నుంచి వెళ్లే రోడ్డు కంకర తేలి గుంతల మయంగా మారింది. గుంతల్లో వర్షం నీళ్లు నిండి ఉండడంతో వాహనదారులు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయించాలని కోరుతున్నారు.